పోర్న్ స్టార్‌గా ప్రముఖ డైరెక్టర్ కుమార్తె

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్తత కుమార్తె మికేలా పోర్న్‌ స్టార్‌గా నటించనున్నట్టుగా స్వయంగా ఆమెనే ప్రకటించింది. ఇప్పటికే స్ట్రిప్ క్లబ్‌లో ఎంట్రీకోసం స్ట్రిప్పర్ లైసెన్స్ పొందేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకుంది. తాను పోర్న్‌స్టార్‌గా నటించేందుకు తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారని ‘ది సన్‌’ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన కాబోయే భర్త చక్ పాంకో కూడా దీనికి అంగీకరించారట. తన భర్తపై ఉన్న గౌరవంతో సోలో వీడియోస్ మాత్రమే చేస్తాననని మికేలా స్పష్టం చేశారు. చిన్నతనంలో తానపై లైంగిక దాడి జరిగినట్లు ఆమె వెల్లడించారు. 

మికేలా తీసుకున్న నిర్ణయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘‘తాను పోర్న్ స్టార్ అని మికేలా తన తండ్రి  స్టీవెన్ స్పీల్ బర్గ్‌కి చెప్పిందట. అందుకు ఆయన ఒప్పుకున్నారట. పోర్న్‌ను ఇంతకుమించి ఎవరూ సపోర్ట్ చేయలేరు.  ఇప్పుడిప్పుడే ప్రపంచం మారుతోంది.’’ అని వర్మ పేర్కొన్నారు. 

0
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *