ఈగ
వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ఈగ. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. బిందు (సమంత) వాళ్ళ ఎదురింటిలో నివసిస్తూ ఉంటాడు నాని (నాని), అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి నాని బిందుని ప్రేమిస్తూ ఉంటాడు. బిందు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ 511 అనే ఎన్జీవో సంస్థని నడుపుతూ అందులో తను కూడా ఒక సోషల్ వర్కర్ గా పనిచేస్తూ ఉంటుంది. బిందు కూడా నానిని ప్రేమిస్తుంది కానీ చెప్పకుండా తనే తెలుసుకోవాలని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో బిందు నడిపే ఎన్జీవో సంస్థకి సహాయం చేసే గొప్ప ధనికుని పాత్రలో పరిచయమైన సుదీప్ (సుదీప్) బిందుని ఇష్టపడతాడు. సుదీప్ చాలా క్రూరమైన స్వభావం కలవాడు, తన అవసరానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడడు. నాని బిందుని ప్రేమిస్తున్నాడని సుదీప్ కి తెలియగానే నానిని అతి కిరాతకంగా చంపేస్తాడు. చనిపోయిన నానినే మళ్ళీ ఈగగా పుడతాడు. అలా జన్మించిన ఈగ తనే నాని అని బిందుకి ఎలా తెలియజేసింది మరియు తనను చంపిన సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుందనేదే మిగిలిన చిత్రం.      

A city in southern China and a bag containing a million yuan draw several people from diverse backgrounds with different personal motives into a bloody conflict

Featured

When Chloe discovers that her new home's garden gnomes are not what they seem, she must decide between the pursuit of a desired high school life and taking up the fight against the Troggs

Lightning McQueen sets out to prove to a new generation of racers that he's still the best race car in the world.

Featured

Showing all 5 results