0

లవ్ (Love) | తెలుగు లఘు చిత్రం | Telugu Short Film 2018 | Bala Satish Independent

by వాసు బొజ్జpublished on 22/02/2020
0 views

మనసైన కథ.. మనదైన కథ.. ఇలాగే తీయాలి ❤️

🎬🎬

ప్రశ్న: షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి?
సమాధానం: (పూర్తిగా రాయలేను గానీ.. చాలా చెప్పొచ్చు)

ప్రశ్న: షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీయాలి?
సమాధానం: వెండితెరపై నిలబడగలిగే సత్తా నీలో ఎంతుందో చిన్ని తెరపై నీకు నువ్వు నిరూపించుకునేందుకు..❤️❤️

అసలు కథంతా పై రెండు ప్రశ్నలు, సమాధానాల్లోనే ఉంది. మిగిలిందంతా నా ఉపోద్ఘాతమే.

🎬🎬

షార్ట్ ఫిల్మ్ అంటే పదిమంది చూడాలి. అందులో ఐదుగురైనా మెచ్చుకోవాలి అనే ఆలోచన ఉండేది నాకు. నిజమేగా! ఎందుకు తీస్తారు లఘు చిత్రాలు? యూట్యూబులో పెట్టి గంటగంటకూ ఎన్ని వ్యూవ్స్, లైక్స్ వచ్చాయో చూడటం ఎందుకు? మన ఆలోచనలను జనాల ముందు పెట్టేందుకేగా అనుకునేవాణ్ని. అయితే అదొక్కటే కాదని తెలియజెప్పిన మనిషి.. అతను తీసిన షార్ట్ ఫిల్మ్ ఇన్నాళ్లకు దొరికింది.

తన బలం తనకు​ తెలియడానికి హనుమంతుడికి సముద్రాన్ని ఎదుర్కొనే సవాల్ వచ్చింది. అలాగే ఫిల్మ్ మేకర్‌గా మీలోని ప్రతిభను మీరే అంచనా వేసేందుకు తొలి షార్ట్ ఫిల్మ్ నిర్మాణం అనే సవాల్ ఎదుర్కోవాలి. లంకకు చేరి ఆంజనేయుడు విజయం సాధించాడు. తీసిన మీకు 60 శాతం తృప్తినిచ్చిన చిత్రం(100 శాతం సంతృప్తి రావడం ఎప్పటికీ అసాధ్యమని నా అభిప్రాయం) చూసిన వారికి 80 శాతం నచ్చితే గెలుపు దక్కినట్లే. ఆ విషయం ఈ లఘు చిత్రం చూశాక అర్థమైంది.

కథేంటి?? ✍️✍️

ఓ ముచ్చటైన ప్రేమ జంట. అమ్మాయి ఇంటికి వచ్చి అబ్బాయి చేసిన మనసైన చిలిపి అల్లరే ఈ చిత్ర కథ. కనులవిందైన కథ❤️❤️

ఎలా తీశారు??📽️📽️

ప్రముఖ గాయని, విదుషీమణి బాంబే జయశ్రీ గారి గొంతులో తులసీదాసు రాసిన ‘గోపాల గోకుల వల్లవీ ప్రియ’ పాటతో చిత్రం మొదలు పెట్టారు. ఈ పాటను చాలా మంది పాడారు. అయితే జయశ్రీ గారి గాత్రంలోని ఈ పాట ఎందుకనో ఎక్కువ మందికి చేరలేదు. ఒకరకంగా అజ్ఞాతంలో ఉన్న పాటతో చిత్రం ఆరంభించారంటేనే.. ఏదో కొత్తదనానికి తెర తీశారన్న ఆలోచన కలిగింది నాకు. పాటకు తగ్గట్టు కృష్ణుడి బొమ్మను చూపిస్తూ కెమరా కదిలిన తీరు బాగుంది.

కథానాయికకు జ్యోతి వర్మ(వేదం, రంగస్థలం సినిమాల ఫేమ్) డబ్బింగ్ చెప్పారు. ఆమె గాత్రం పాత్రకు నిండుదనాన్ని తెచ్చింది. కథానాయిక నటనకు మంచి మార్కులు పడాల్సిందే! కథానాయకుడు తన పరిధిలో​ కనబరిచిన నటన ముచ్చటగా ఉంది.

పార్ట్ ఫిల్మ్‌లో నాకు బాగా నచ్చిన.. కొత్తగా అనిపించిన అంశం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ అనగానే భారీ వాయిద్యాలు వాడకుండా.. కొత్త పద్ధతిలో స్వరాలను వాడటం అద్భుతంగా ఉంది. అలాగే ఫిల్మ్ చివర్లో వచ్చే సంగీతం చాలా బాగుంది 👌👌.

నచ్చని అంశాలూ ఉన్నాయి 😠😠

* ఇంత చక్కటి చిత్రం తీసి దానికి పేరు పెట్టడం మర్చిపోయారు డెరైక్టర్ గారు.. ఆ బాధ్యత ప్రేక్షకుల మీదే పెట్టేశారు.

* హీరో, హీరోయిన్ పాత్రల పేర్ల చివర ఎందుకో క్యాస్ట్ ట్యాగ్స్(కులం తోకలు) తగిలించారు. అవసరమా!!

అసలు సంగతి 🙋🏻‍♂️🙋🏻‍♂️

షార్ట్ ఫిల్మ్స్ అంటే పదిమందికి నచ్చాలన్న నిబంధన కంటే ముందు తీసిన మనకు నచ్చాలి. మనదైన కథ.. మనసైన కథను ఎలా తెరకెక్కించామో చూశాక సంతృప్తి రావాలి. అదే ఫిల్మ్ మేకర్‌ అసలైన విజయం. ఆ తర్వాత విమర్శలు రావొచ్చు.. ప్రశంసలు కురవొచ్చు. మనలోని ప్రతిభ మనకు చూపటమే ఈ లఘు చిత్రాల ప్రధాన ఉద్దేశం. ఇదే ఈ ఫిల్మ్ నాకు నేర్పింది.

ఈ చిత్రం చూడండి. దర్శకుడి స్వీయానుభవమే కథగా మారి కనులవిందుగా తెరకెక్కిన చిత్రం ఇది(అని ఆయనే నాకు పర్సనల్‌గా చెప్పారు). చూశాక మీ అనుభవాలనూ ఇలా తెరపై తెలిపేందుకు సిద్ధం కండి.

చిత్రం కోసం: https://youtu.be/MOxZMggQh-0

ఈ లఘు చిత్రం గురించి చక్కగా తన అభిప్రాయాలని వెలిబుచ్చిన సాయి వంశీ గారికి ధన్యవాదాలు.ఈ పోస్ట్ ఈయన ఫెస్బుక్ టైమ్ లైన్ నుండి తీసుకోబడింది.రచయితకి ధన్యవాదాలు. ఆయన ఫేస్బుక్ ఐడి లింక్sai.vamshiIAS

0
Comments

Your email address will not be published. Required fields are marked *

 1. వాసు బొజ్జ

  వాసు బొజ్జ

  మనసైన కథ.. మనదైన కథ.. ఇలాగే తీయాలి ❤️

  🎬🎬

  ప్రశ్న: షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి?
  సమాధానం: (పూర్తిగా రాయలేను గానీ.. చాలా చెప్పొచ్చు)

  ప్రశ్న: షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీయాలి?
  సమాధానం: వెండితెరపై నిలబడగలిగే సత్తా నీలో ఎంతుందో చిన్ని తెరపై నీకు నువ్వు నిరూపించుకునేందుకు..❤️❤️

  అసలు కథంతా పై రెండు ప్రశ్నలు, సమాధానాల్లోనే ఉంది. మిగిలిందంతా నా ఉపోద్ఘాతమే.

  🎬🎬

  షార్ట్ ఫిల్మ్ అంటే పదిమంది చూడాలి. అందులో ఐదుగురైనా మెచ్చుకోవాలి అనే ఆలోచన ఉండేది నాకు. నిజమేగా! ఎందుకు తీస్తారు లఘు చిత్రాలు? యూట్యూబులో పెట్టి గంటగంటకూ ఎన్ని వ్యూవ్స్, లైక్స్ వచ్చాయో చూడటం ఎందుకు? మన ఆలోచనలను జనాల ముందు పెట్టేందుకేగా అనుకునేవాణ్ని. అయితే అదొక్కటే కాదని తెలియజెప్పిన మనిషి.. అతను తీసిన షార్ట్ ఫిల్మ్ ఇన్నాళ్లకు దొరికింది.

  తన బలం తనకు​ తెలియడానికి హనుమంతుడికి సముద్రాన్ని ఎదుర్కొనే సవాల్ వచ్చింది. అలాగే ఫిల్మ్ మేకర్‌గా మీలోని ప్రతిభను మీరే అంచనా వేసేందుకు తొలి షార్ట్ ఫిల్మ్ నిర్మాణం అనే సవాల్ ఎదుర్కోవాలి. లంకకు చేరి ఆంజనేయుడు విజయం సాధించాడు. తీసిన మీకు 60 శాతం తృప్తినిచ్చిన చిత్రం(100 శాతం సంతృప్తి రావడం ఎప్పటికీ అసాధ్యమని నా అభిప్రాయం) చూసిన వారికి 80 శాతం నచ్చితే గెలుపు దక్కినట్లే. ఆ విషయం ఈ లఘు చిత్రం చూశాక అర్థమైంది.

  కథేంటి?? ✍️✍️

  ఓ ముచ్చటైన ప్రేమ జంట. అమ్మాయి ఇంటికి వచ్చి అబ్బాయి చేసిన మనసైన చిలిపి అల్లరే ఈ చిత్ర కథ. కనులవిందైన కథ❤️❤️

  ఎలా తీశారు??📽️📽️

  ప్రముఖ గాయని, విదుషీమణి బాంబే జయశ్రీ గారి గొంతులో తులసీదాసు రాసిన ‘గోపాల గోకుల వల్లవీ ప్రియ’ పాటతో చిత్రం మొదలు పెట్టారు. ఈ పాటను చాలా మంది పాడారు. అయితే జయశ్రీ గారి గాత్రంలోని ఈ పాట ఎందుకనో ఎక్కువ మందికి చేరలేదు. ఒకరకంగా అజ్ఞాతంలో ఉన్న పాటతో చిత్రం ఆరంభించారంటేనే.. ఏదో కొత్తదనానికి తెర తీశారన్న ఆలోచన కలిగింది నాకు. పాటకు తగ్గట్టు కృష్ణుడి బొమ్మను చూపిస్తూ కెమరా కదిలిన తీరు బాగుంది.

  కథానాయికకు జ్యోతి వర్మ(వేదం, రంగస్థలం సినిమాల ఫేమ్) డబ్బింగ్ చెప్పారు. ఆమె గాత్రం పాత్రకు నిండుదనాన్ని తెచ్చింది. కథానాయిక నటనకు మంచి మార్కులు పడాల్సిందే! కథానాయకుడు తన పరిధిలో​ కనబరిచిన నటన ముచ్చటగా ఉంది.

  పార్ట్ ఫిల్మ్‌లో నాకు బాగా నచ్చిన.. కొత్తగా అనిపించిన అంశం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ అనగానే భారీ వాయిద్యాలు వాడకుండా.. కొత్త పద్ధతిలో స్వరాలను వాడటం అద్భుతంగా ఉంది. అలాగే ఫిల్మ్ చివర్లో వచ్చే సంగీతం చాలా బాగుంది 👌👌.

  నచ్చని అంశాలూ ఉన్నాయి 😠😠

  * ఇంత చక్కటి చిత్రం తీసి దానికి పేరు పెట్టడం మర్చిపోయారు డెరైక్టర్ గారు.. ఆ బాధ్యత ప్రేక్షకుల మీదే పెట్టేశారు.

  * హీరో, హీరోయిన్ పాత్రల పేర్ల చివర ఎందుకో క్యాస్ట్ ట్యాగ్స్(కులం తోకలు) తగిలించారు. అవసరమా!!

  అసలు సంగతి 🙋🏻‍♂️🙋🏻‍♂️

  షార్ట్ ఫిల్మ్స్ అంటే పదిమందికి నచ్చాలన్న నిబంధన కంటే ముందు తీసిన మనకు నచ్చాలి. మనదైన కథ.. మనసైన కథను ఎలా తెరకెక్కించామో చూశాక సంతృప్తి రావాలి. అదే ఫిల్మ్ మేకర్‌ అసలైన విజయం. ఆ తర్వాత విమర్శలు రావొచ్చు.. ప్రశంసలు కురవొచ్చు. మనలోని ప్రతిభ మనకు చూపటమే ఈ లఘు చిత్రాల ప్రధాన ఉద్దేశం. ఇదే ఈ ఫిల్మ్ నాకు నేర్పింది.

  ఈ చిత్రం చూడండి. దర్శకుడి స్వీయానుభవమే కథగా మారి కనులవిందుగా తెరకెక్కిన చిత్రం ఇది(అని ఆయనే నాకు పర్సనల్‌గా చెప్పారు). చూశాక మీ అనుభవాలనూ ఇలా తెరపై తెలిపేందుకు సిద్ధం కండి.

  చిత్రం కోసం: https://youtu.be/MOxZMggQh-0

  ఈ లఘు చిత్రం గురించి చక్కగా తన అభిప్రాయాలని వెలిబుచ్చిన సాయి వంశీ గారికి ధన్యవాదాలు.ఈ పోస్ట్ ఈయన ఫెస్బుక్ టైమ్ లైన్ నుండి తీసుకోబడింది.రచయితకి ధన్యవాదాలు. ఆయన ఫేస్బుక్ ఐడి లింక్ : sai.vamshiIAS

  0